Gelupu Meede (1)
Subscribe Now
అచ్చుల వర్గీకరణం · జాతీయాలు · సమానార్థకాలు

Civil Services · Telugu Paper II · భాషాశాస్త్రం

అచ్చుల వర్గీకరణం
జాతీయాలు · సమానార్థకాలు · పొడుపుకథలు

Section-A  ·  భాషాశాస్త్రం  ·  వ్యాకరణం  ·  జానపదం
🔤 అచ్చుల వర్గీకరణం – సాధారణ విభాగం
గమనిక: పలికే నిడివిని బట్టి అచ్చులను రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు. పరీక్షల్లో ఈ వర్గీకరణ నేరుగా అడుగుతారు.
విభాగంఅచ్చులువివరణ
హ్రస్వాచ్చులుఅ · ఇ · ఉ · ఋ · ఎ · ఒతక్కువ నిడివిలో పలికే అచ్చులు
దీర్ఘాచ్చులుఆ · ఈ · ఊ · ఋ · ౠ · ఏఎక్కువ నిడివిలో పలికే అచ్చులు
నోరు తెరవడాన్ని బట్టి వర్గీకరణ
ఉన్నతాచ్చులు
(సంవృతాచ్చులు)
ఇ ఈ ఉ ఊ
నోరు కొద్దిగా మాత్రమే తెరుచుకుంటుంది. నాలుక నోటి పై భాగంలో ఉంటుంది.
మధ్యాచ్చులు
(అర్థ సంవృతాచ్చులు)
ఎ ఏ ఒ ఓ
నోరు కొంచెం ఎక్కువగా తెరుచుకుంటుంది. నాలుక నోటి మధ్యభాగంలో ఉంటుంది.
నిమ్నాచ్చులు
(వివృతాచ్చులు)
అ ఆ
నోరు పూర్తిగా తెరుచుకుంటుంది. నాలుక నోటి కింది భాగంలో ఉంటుంది.
📊 నాలుక ఎత్తును బట్టి – 6 స్థాయిల వర్గీకరణ
ఆధారం: ఆచార్య పి.ఎస్. సుబ్రహ్మణ్యం ప్రతిపాదించిన భారతీయ భాషల వర్గీకరణ. ఈ 6 స్థాయిలు పరీక్షలో తరచుగా అడుగుతారు.
1
ఉన్నతం
నాలుక నోటి పైభాగంలో ఉంటుంది
2
ఈషదున్నతం
నాలుక పైభాగం కంటే కొద్దిగా కిందికి ఉంటుంది
3
మధ్యమం
నాలుక నోటి మధ్య భాగంలో ఉంటుంది
4
నిమ్నతర మధ్యమం
నాలుక మధ్యభాగం కంటే కొద్దిగా కిందికి ఉంటుంది
5
ఈషన్నిమ్నం
నాలుక నిమ్నభాగం కంటే కొంచెం పైగా ఉంటుంది
6
నిమ్నం
నాలుక నోటి యొక్క కింది భాగంలో ఉంటుంది
👅 నాలుక కదలికను బట్టి వర్గీకరణ

నాలుక ముందు-వెనుకలకు కదలడాన్ని బట్టి అచ్చులను మూడు రకాలుగా వర్గీకరించారు.

అగ్రాచ్చులు
పూర్వాచ్చు · తాలవ్యాచ్చులు
విస్తారిత స్వరాలు
ఇ ఈ ఎ ఏ
జిహ్వాగ్రం కఠిన తాలువు వైపు లేస్తుంది. పెదవులు విస్తరిస్తాయి కాబట్టి అనోష్ఠీకృతాలు అంటారు.
కేంద్ర స్వరాలు
మధ్యాచ్చులు
అ ఆ
జిహ్వ మధ్య భాగం మూర్థన్యం వైపు లేస్తుంది. నాలుక తటస్థంగా ఉంటుంది.
అంత్యాచ్చులు
పశ్చిమాచ్చు · కంఠ్యాచ్చులు
వర్తులీకృతాలు
ఉ ఊ ఒ ఓ
నాలుక మూలం మృదుతాలువు వైపు లేస్తుంది. పెదవులు గుండ్రంగా మారతాయి కాబట్టి వర్తులీకృతాలు.
విస్తారిత స్వరాలుపెదవులు సెలవుల వైపు విస్తరించేట్లు పలికేవి — ఇ · ఈ · ఎ · ఏ
వర్తులీకృతాలుపెదవులు గుండ్రంగా మారేవి — ఉ · ఊ · ఒ · ఓ
🗣️ జాతీయాలు – స్వంత వాక్యాల్లో ప్రయోగం
1. నివుఱు కప్పిన నిప్పు
'నివుఱు' = బూడిద. నిప్పు మీద బూడిద పొర కప్పబడి ఉంటే బయటికి కనబడదు. ఉన్న సత్తువను పైకి తెలియకుండా అమాయకంగా కనిపించేవారికి ఈ జాతీయం వాడతారు.
అ) "వాడు చూడటానికి నివుఱు గప్పిన నిప్పులా ఉన్నాడు కానీ, వాడితో పోట్లాట పెట్టుకుంటే నిలువునా నరికేస్తాడు తెలుసా!" ఆ) "ఆవిడ సంగతి నీకు తెలీదు. నివుఱు కప్పిన నిప్పు లాగా కనబడుతుంది కానీ, పట్టు పట్టిందంటే సాధించి తీరుతుంది."
2. చట్టుబండ
'చట్టువు' = గ్రామపు సమావేశ స్థలం (సంస్కృత మూలం). పంతుళ్ల వీధి అరుగుల మీది బడులలో నాపబండల సంఖ్యకు తగినట్లు విద్యార్థులను చేర్చుకునే వారు. బడికి రాకుండా తప్పించుకోవడాన్ని ఈ జాతీయం సూచిస్తుంది.
అ) రమేశ్ చెడ్డ స్నేహాలు మరిగి వాడి చదువు చట్టుబండలు చేసుకున్నాడు. ఆ) బడికి పోకుండా ఎప్పటికప్పుడు ఎగ్గొడుతూ ఉండటం వల్ల సుబ్బడి చదువు చట్టుబండలయింది.
3. కూప మండూకం
కూపం = బావి · మండూకం = కప్ప. బావిలో కప్ప ప్రపంచమంతా అలాగే ఉంటుందని భావిస్తుంది. లోకజ్ఞానం లేనివారిని కూపకూర్మం, కూపస్థ కఛ్ఛపం అంటారు.
అ) ఆ వెంగళప్ప ఒఠ్ఠి కూపకూర్మం లాగా తనకు తెలిసిందే నిజమని వాదిస్తాడు. ఆ) (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి) "నేటి సమాజంలో మహిళలు ఒఠ్ఠి కూపకూర్మాలుగా ఇంటికి బిచ్చమడిగే వాడికి కూడా మొగుణ్ణి సంప్రదిస్తారు."
4. నేతి బీరకాయ
నేతిబీర (ఘృతకోశాతకి) పేరులో నెయ్యి ఉన్నా లోపల ఏమీ ఉండదు. పేరుకు తగ్గ గుణగణాలు లేనివారిని, పైకి పటాటోపంగా కనబడినా లోపల విశేషం లేనివారిని గురించి వాడుతారు.
అ) శ్రీకాంతుడు పైకి ఆస్తిపరుడిగా కనిపించినా, అసలు లెక్కాపత్రాల్లో ఆ ఆస్తి అంతా నేతిబీరకాయలో నేయ్యే. ఆ) ఆ కుటుంబం సఖ్యత గురించి ఊళ్లో గొప్పగా చెబుతారు కానీ, వాళ్ళలో కలిసికట్టుతనం నేతిబీరలో నెయ్యి వంటిదే.
5. తెరచిరాజు
చదరంగం నుంచి పుట్టిన జాతీయం. వినయంగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నట్లుండి దెబ్బతీయడాన్ని తెరచిరాజు అంటారు.
అ) గవర్రాజు గంగరాజుతో కలిసి వ్యాపారం చేస్తూనే ఉన్నట్టుండి డబ్బంతా కాజేసి గంగరాజుకు తెరచిరాజు చెప్పాడు.
📚 సమానార్థకాలు
పదంసమానార్థకాలు
పండితుడుచదువరి, విద్వాంసుడు, కోవిదుడు, పఠి, ప్రజ్ఞానుడు, ప్రబుద్ధుడు, ప్రాజ్ఞుడు, బుధుడు, మనీషి, విదితుడు, విద్యావంతుడు, విదుడు, విబుధుడు, శిక్షకుడు, శాస్త్రి, శ్రుతవంతుడు, సుధీ
పెండ్లివివాహము, ఉద్వాహము, ఉపయమనము, కరగ్రహణము, కరపీడనము, కల్యాణము, దారక్రియ, పరిణయము, పాణిగ్రహణము, పాణిబంధము, పాణి స్వీకృతి, పెండిలి, మనువు, సముద్వాహము, లగ్గం
ఋషిఅడవి నెలవరి, ఉదాస్థితుడు, జటిలుడు, జడదారి, జడదాలుపు, జపి, తపసి, తపస్వి, తపోధనుడు, తాపసి, పరోక్షుడు, నిరాబారి, పలుకువాలు, పారికాంక్షి, భట్టారకుడు, ముని, మౌని, యతి, యమి, సంయమి
కన్నునేత్రము, చూపు, జాడ, వెదురు గణుపు కింది గుంట, బండిచక్రము, నెమలి ఈక, వలయందలి రంధ్రము, పైరు కంకి, రీతి, గంటు, చిట్టె, అక్షి, పర్వము, చక్షువు, లోచనము, నయనము, దృక్కు, అంబకము
గుడిఆలయము, కోవెల, దేవళము, దేవగృహము, దేవాయతనము, పరీవేషము, మండలము, గుడుసు, గుడికట్టు, వరదగుడి, వలయరేఖ, పరిఖ
↔️ వ్యతిరేకార్థక పదాలు
పదంవ్యతిరేకం
నెమ్మదివేగం · త్వరితం · శీఘ్రం
తడిపొడి
స్థూలముసూక్ష్మము
ఆరోగ్యముఅనారోగ్యము
ప్రాచీనముఆధునికము
✏️ పదాలలోని తప్పులు సవరించండి
#తప్పు పదంసరైన పదం
iజనార్థనుడుజనార్దనుడు
iiధనుంజయుడుధనంజయుడు
iiiసీతలముశీతలము
ivదర్మవిఘ్రహుడుధర్మవిగ్రహుడు
vవిధ్యారంబమువిద్యారంభము
🧩 విప్పండి – పొడుపుకథలు
గుండు మీద గుండు
పదహారు గుండ్లు
పదహారు గుండ్లమీద
పట్టుకుచ్చు
💬 సమాధానం రాయండి
అంతారం కాడ చెట్టును కొడితే
అంతకుదాకె – బాలెంతకు దాకె
చెర్లున్న చేపకు దాకె
చెట్టుకింద బండకు దాకె
మళ్లొచ్చి మనకు దాకె
💬 సమాధానం రాయండి
రసరసాలు తిన్నాడు కానీ
రాజు కడుపులో పేగుల్లేవు
💬 సమాధానం రాయండి
పొట్టివాడికి పుట్టెడు అంగీలు
💬 సమాధానం రాయండి
జానెడు గుంతలో మానెడు పగడాలు
మీ సమాధానాన్ని కామెంట్లో రాయండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *