Civil Services · Telugu Paper II · 2015 · UGC NET
శకుంతల మానసిక వేదన
సమాజ స్వరూప విశ్లేషణ
Section-A · పద్య విశ్లేషణ · UGC NET సాధన · 2015 సివిల్ సర్వీసెస్
పద్య విశ్లేషణ – 2015 సివిల్ సర్వీసెస్ Paper II
ప్రశ్న: ఈ కింది పద్యంలో స్త్రీ మానసిక వేదనలో సమాజ స్వరూపాన్ని పరిశీలించండి. సందర్భం: దుష్యంతుని పేరోలగంలో శకుంతల తిరస్కరించబడిన తరువాత హృదయంలో పడిన వేదన.
పద్యం
తడయక పుట్టిన నాఁడ తల్లిచెఁదండ్రిచే విడువఁ
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెద నొక్కొ
నుడువులు వేయు నింకేల యిప్పాటి నోములు దొల్లి
కడఁగి నోఁచితిని గాకేమి యనచును గందె డెందమున.
బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెద నొక్కొ
నుడువులు వేయు నింకేల యిప్పాటి నోములు దొల్లి
కడఁగి నోఁచితిని గాకేమి యనచును గందె డెందమున.
ప్రతిపదార్థం
| పదం | అర్థం |
|---|---|
| పుట్టిననాడే | పుట్టిననాడు+అ = పుట్టిననాడే |
| తడయక | ఆలస్యంకాక; వెంటనే |
| తల్లిచేన్ | మేనకచేత (తల్లిచేత) |
| తండ్రిచేన్ | విశ్వామిత్రుడిచేత (తండ్రిచేత) |
| విడువంబడితిన్ | వదలివేయబడినాను |
| విడువంబడియెదన్+ఒక్కొ | వదలబడతానో ఏమో! |
| నుడువులు వేయున్ | వేయి (పెక్కు) మాటలు |
| ఈ+పాటి నోములు | ఇంతటి (ఫలాన్ని ఇచ్చే) నోములు, పూజలు |
| తొల్లి | పూర్వం |
| కడంగి | పూనుకొని |
| నోచితిని కాక+ఏమి | నోచాను కాబోలు |
| డెందమునన్ | హృదయంలో |
| కందెన్ | దుఃఖించింది; బాధపడింది |
తాత్పర్యం
పుట్టిననాడే వెంటనే తల్లిదండ్రులచేత విడువబడినాను. ఇప్పుడు భర్తచేత కూడ విడువబడతాను కాబోలు. ఇక వేయి మాటలాడటమెందుకు? పూర్వం ఇటువంటి కొరనోములే నోచాను కాబోలు — అని శకుంతల మనసులో బాధపడింది.
సమాజ స్వరూప విశ్లేషణ
ఏనెట నీ వెట సుతుడెట యే నెన్నఁడు తొల్లి చూచి యెఱుగను నిన్నున్
— లోకాపవాదుకు జంకిన దుష్యంతుడు శకుంతలను తిరస్కరిస్తూ
తల్లిదండ్రుల వదలివేత
మేనక, విశ్వామిత్రుడు పుట్టిన వెంటనే శకుంతలను వదలివేశారు. ఆమె జీవితారంభమే నిస్సహాయతలో మొదలైంది.
భర్త తిరస్కారం
దుష్యంతుడు గాంధర్వవివాహ సత్యాన్ని లోకానికి ప్రకటించే బాధ్యత నిర్వహించకుండా నిర్దాక్షిణ్యంగా ఆమెను తిరస్కరించాడు.
పెంచిన తండ్రి మాటలు
"స్త్రీలకు పుట్టింటిలో ఎక్కువకాలం ఉండటం మంచిదికాదు. భర్త రక్షణలో బ్రతకడమే స్త్రీ ధర్మం" అని ముందే చెప్పి పంపాడు.
దైవాశ్రయం
దిక్కుతోచని శకుంతల తనకు న్యాయం జరగదని తెలుసుకొని చివరకు దైవాన్ని ఆశ్రయించింది.
భారత స్త్రీ వ్యక్తిత్వానికి సజీవ రూపకల్పన శకుంతల. గార్హస్థ్య ధర్మానికి భార్య, భర్త, సంతానం, సత్యం అనేవి నాలుగు స్తంభాలు కాగా వాటిపై వివాహ వ్యవస్థ పదిలంగా నిలవాలని ఆమె నేర్చుకున్నది.
సామాజికామోదం లేని వివాహం చేసుకున్న మహిళ, ఆమెకు పుట్టిన సంతానం ఈనాటికీ ఎన్నో రకాల అవమానాలకు, మానసిక వేదనలకూ లోనవుతున్నారు. తనకాలం నాటి స్త్రీల సామాజిక స్థితిగతులను అర్థంచేసుకున్న నన్నయ శకుంతల స్వభావంలోని అమాయకత్వాన్ని, నిస్సహాయ స్థితినీ, ధర్మబుద్ధిని, తార్కికతను అద్భుతంగా వివరిస్తాడు.
ఛందస్సు విశేషాలు
వృత్తంమధ్యాక్కర (దేశీయ ఛందస్సు)
గణాలురెండు ఇంద్రగణాలు + ఒక సూర్యగణం (ప్రతి పాదంలో)
యతిఅయిదవ గణం మొదటి అక్షరంతో నన్నయ యతి పాటించాడు
భాష విశేషంఒక్క 'పతి' శబ్దం తప్ప మిగిలినవన్నీ తెలుగు పదాలే
రసంకరుణ రసాత్మకం
ప్రాసప్రాస నియమం ఉన్నది
UGC NET గత ప్రశ్నలు – సమాధానాలతో
| ప్రశ్న | సమాధానం |
|---|---|
| కన్నడ వీరశైవ వచన గీతాల ప్రభావంతో, జైన పురాణాల రచనా శైలితో ప్రభావితమై తెలుగులో వెలువడిన మొట్టమొదటి పురాణం ఏది? | మార్కండేయ పురాణం |
| పట్టు వస్త్రాలలో వివిధ రకాలను గురించి తన గ్రంథంలో ప్రస్తావించిన కవి ఎవరు? | కొరవి గోపరాజు |
| 'తెనుఁగు' అనే పదాన్ని మొదటగా ప్రయోగించినది ఎవరు? | నన్నయ |
| 'పరకీయ' నాయికా భేదాలు ఏవి? | అన్యోఢ, కన్య |
| తెలుగు అష్టక వాజ్ఞ్మయంలో ప్రసిద్ధమైనవి ఏవి? | జనార్దనాష్టకం, శివాష్టకం |
| నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధ గ్రామదేవత ఎవరు? | చెంగాలమ్మ |
| లోక శాస్త్ర కావ్యాదులను పరిశీలించడం వలన కలిగే శక్తి ఏది? | వ్యుత్పత్తి |
| ఆంధ్ర విష్ణువు త్రిలింగ దేశాన్ని స్థాపించినట్లుగా పేర్కొన్న గ్రంథం ఏది? | ఆంధ్రకౌముది |
| 'స్థానం' అంటే ఏమిటి? | ముఖయంత్రం లోని కదలిక లేని భాగం 'స్థానం' |
| 'హరీతి పుత్ర' అనే మాతృసంజ్ఞను వాడిన రాజవంశం ఏది? | చాళుక్య రాజవంశం |
సాధన – UGC NET అభ్యాస ప్రశ్నలు
💬 కింది ప్రశ్నలకు మీ సమాధానాలను కామెంట్ రూపంలో రాయండి. అన్నీ పరీక్ష దృష్టికోణం నుండి ముఖ్యమైనవి.
| # | ప్రశ్న |
|---|---|
| 1 | అక్కన్న, మాదన్న గుహలు ఎక్కడ ఉన్నాయి? |
| 2 | తెలుగు నవలకు బహుమతి ప్రకటించి ప్రోత్సహించిన మొదటి పత్రిక ఏది? |
| 3 | హరిహరినాథ తత్త్వాన్ని ప్రబోధించిన కవి ఎవరు? |
| 4 | సవర్ణాలు ఏ ప్రవృత్తిలో ఉండటం సర్వసాధారణం? |
| 5 | అగ్రాచ్చులు ఏవి? |
| 6 | క్యూనీ ఫారం లిపిని ఏర్పరిచిన వారెవరు? |
| 7 | కాశీఖండంలో గుణనిధి కథ ఏ పేరుతో కనిపిస్తుంది? |
| 8 | "మల్లెపూలమీద పరుటాడు, మంచిగంధం రాసుకుంటాడు మరి ఎప్పుడూ ఎందుకేడుస్తాడు?" అని తిలక్ ఏ కవితలో పేర్కొన్నాడు? |
| 9 | ధాన్యం పోసుకునే మట్టిపాత్రను కొండరెడ్లు ఏమని పిలుస్తారు? |
| 10 | చిత్తూరు జిల్లాలో డప్పు నృత్యాన్ని మరేమని కూడా పిలుస్తారు? |