Gelupu Meede (1)
Subscribe Now
సివిల్ సర్వీసెస్ తెలుగు – Paper II 2వ సాధన సెట్
సివిల్ సర్వీసెస్ తెలుగు Paper II – 2వ వారం శనివారం సాధన సెట్. నన్నయ పద్య విశ్లేషణ, UGC NET గత ప్రశ్నలు సమాధానాలతో, మరియు సాధన ప్రశ్నలు – Section A.
సివిల్ సర్వీసెస్ తెలుగు – Paper II | 2వ వారం శనివారం
Civil Services · Telugu Paper II · Week 2

సివిల్ సర్వీసెస్ తెలుగు – Paper II
2వ సాధన సెట్

Section-A  ·  సాహిత్యం  ·  భాషాశాస్త్రం  ·  చరిత్ర
📖 పద్య విశ్లేషణ – నన్నయ శిల్పం
సందర్భం: లోకాపవాద భీతితో తనను, పుత్రుడైన భరతుడిని స్వీకరించడానికి వెనుకాడుతున్న దుష్యంతుడికి శకుంతల గార్హస్థ్య ధర్మాన్ని పాటించమని చెబుతోంది.
పద్యం
విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్త్రగా
త్ర పరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్రగా
త్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే.
ప్రతిపదార్థం
పదంఅర్థం
ఉర్వీనాథభూమియొక్క పతివైన ఓ రాజా!
విపరీత ప్రతిభాషలువిరుద్దాలైన మారుమాటలు – ఎందుకు చెప్పాలి?
పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబుకుమారుడి శరీరాన్ని కౌగిలించుకొనటంవలని హాయి
చేకొనుముస్వీకరించుము / అనుభవింపుము
ముక్తాహార కర్పూర సాంద్రపరాగ ప్రసరంబుముత్యాలహారాలు, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం
చందనముమంచి గంధము
చంద్రజ్యోత్స్నవెన్నెల
హృద్యంబుమనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేది
కడున్ శీతమేమిక్కిలి చల్లదనంగా ఉండునా? (ఉండదని భావం)
తాత్పర్యం

ఓ రాజా! విరుద్దాలైన మారుమాటలు ఎందుకు? ఈ పుత్రుడిని కౌగిలించుకొని ఈతడి కౌగిలివలన కలిగే సుఖాన్ని అనుభవించుము. ముత్యాలహారాలూ, పచ్చకర్పూరపు దట్టమైన పొడి ప్రసారం, మంచి గంధమూ, వెన్నెలయూ – జీవులకు పుత్రుని కౌగిలివలె మనసుకు సుఖాన్నీ, మంచి చల్లదనాన్నీ కలిగించలేవు.

విశేషాలు
అలంకారంవ్యతిరేకం
సిద్ధాంతంస్పర్శ సిద్ధాంతం
ఉపమాద్రవ్యాలుముత్యాలహారాలు, కర్పూరం, గంధం, వెన్నెల
నన్నయ శిల్పగుణంఅక్షర రమ్యత
సాహిత్య విశ్లేషణ

నన్నయ శబ్ద శిల్పానికి సంబంధించిన గుణం అక్షర రమ్యత. ఆయన కేవలం నాద సౌందర్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా రసానుగుణమైన అక్షరాల కూర్పుకు పెద్దపీట వేయడం వల్ల అక్షర రమ్యత ఈ పద్యంలో పరిపూర్ణంగా వికసించింది.

సంస్కృత భారతంలో లేని వస్తు సందోహాన్ని నన్నయ ఈ పద్యంలో ప్రయోగించాడు. వ్యాసుడు శకుంతల వాక్యాలలో ధ్వనిస్తాడు; రుషి వంటి నన్నయభట్టు ఆమె మాటలలో నానారుచిరార్థ సూక్తినిధిగా దర్శనమిస్తాడు. "పుత్రగాత్ర పరిష్వంగం" గొప్పతనం తెలుగు సాహిత్యంలో అజరామరంగా నిలిచింది.

UGC NET గత ప్రశ్నలు – సమాధానాలతో
ప్రశ్నసమాధానం
సంస్కృతం, లాటిన్, గ్రీక్ భాషలు ఒకే మూలం నుంచి పుట్టాయని ప్రతిపాదించిన భాషాశాస్త్రవేత్త?సర్ విలియం జోన్స్
"ఇచ్చు" అనేది?సకర్మకం
"సారమతిం గవీంద్రులు" పద్యం ఏ పురుషలో వ్రాయబడింది?ప్రథమ పురుష
తాలవ్యీకరణ విషయంలో ప్రాచీనతను పాక్షికంగా నిలబెట్టుకున్న భాష?తెలుగు
ఉల్లేఖాలంకారానికి వేమన ఉజ్జలమైన ఉదాహరణం అన్నది ఎవరు?కొర్లపాటి శ్రీరామమూర్తి
"కారే రాజులు, రాజ్యముల్ గలుగవే" అన్న భాగవతంలోని పాత్ర?బలిచక్రవర్తి పాత్ర
రుద్రమదేవి కాలంలో ఆంధ్రను సందర్శించిన ఇటలీ యాత్రికుడు?మార్కొపోలో
శాసన పరిభాషలో "ఇనుపటెడ్ల"ను ఏ విధంగా పేర్కొన్నారు?ఎనుంగొడ్లు
చేనేత వృత్తి పదకోశం రూపకర్తలు?భద్రీరాజు కృష్ణమూర్తి, పోరంకి దక్షిణామూర్తి
'మన గురజాడ' పుస్తక రచయిత?శ్రీశ్రీ
సాధన
💬 కింది ప్రశ్నలకు మీ సమాధానాలను కామెంట్ రూపంలో రాయండి. అన్నీ పరీక్ష దృష్టికోణం నుండి ముఖ్యమైనవి.
#ప్రశ్న
i'ప్రయత్నం' అంటే ఏమిటి?
iiకనువినుకలి నెలవు పుట్టువు అనే అచ్చతెలుగు పదంతో పొన్నగంటి తెలగన్న యయాతి చరిత్రలో ఎవరిని సంబోధించాడు?
iiiతెలంగాణ కమ్యూనిష్టు ఉద్యమానికి తొలి నాయకులు ఎవరు?
ivకాదంబరిలో పుండరీకుడి రెండు జన్మలు ఏవి?
vబాదామి చాళుక్యుల రాజచిహ్నంలో కనిపించే జంతువు ఏది?
viశాతవాహనుల కాలంలో ఆరుగొలను, గుంటుపల్లి, అమరావతి, నాగార్జునకొండ, ఉండవల్లి గ్రామాల ప్రత్యేక ప్రాముఖ్యత ఏమిటి?
viiజమాబందీ రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టిన ముస్లిం నాయకుడు ఎవరు?
viiiసమాహార కళగా పేరొందిన జానపద కళ ఏది?
ixపచ్చపొడుపు ఏ కళ కిందికి వస్తుంది?
xఉరుములు, మెరుపులు లేకుండానే ఉత్తరాద్రి చెరువు నిండింది – విప్పండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *