Civil Services · Telugu Paper II · 3వ వారం · ఆదివారం
హల్లులు – వర్గీకరణం
జాతీయాలు · పొడుపుకథలు
Section-A · భాషాశాస్త్రం · వ్యాకరణం · జానపదం
హల్లులు – పరిచయం
గమనిక: తెలుగు భాషలో హల్లులు మొత్తం 36. ప్రాణముల (అచ్చుల) సహాయంతో పలికేవి కాబట్టి వీటిని ప్రాణులు లేదా వ్యంజనాలు అని పిలుస్తారు. వీటిచే అక్షరాలు స్పష్టం చేయబడతాయి కాబట్టి ఇవి వ్యంజనాలు.
హల్లుల మూడు ప్రధాన భాగాలు
పరుషములు
మొత్తం 5
క చ ట త ప
కఠినముగా ఉచ్చరింపబడేవి
సరళములు
మొత్తం 5 · అల్పాక్షరాలు
గ జ డ ద బ
సులభముగా ఉచ్చరించబడేవి. వీటినే అల్పాక్షరాలని కూడా అంటారు.
స్థిరములు
పరుష సరళాలు కానివి అన్నీ
ఖ ఘ ఛ ఝ జ్ఞ ఠ ఢ ణ థ ధ న ఫ భ మ య ర ల వ శ ష స హ ళ ఱ
వ్యాకరణ కార్యాల వలన సామాన్యంగా మార్పులేకుండా స్థిరంగా ఉండేవి.
వర్గాలు – పుట్టుక స్థానాల వారీగా
గుర్తుంచుకోండి: వర్గాలు మొత్తం 5. ప్రతి వర్గంలో 5 అక్షరాలు ఉంటాయి. మొత్తం 25 అక్షరాలు.
కంఠ్యాలు
కంఠం నుండి పుట్టేవి
క ఖ గ ఘ జ్ఞ
తాలవ్యాలు
దవడ నుండి పుట్టేవి
చ ఛ జ ఝ ఞ
మూర్థన్యాలు
నోటి పై భాగం నుండి
ట ఠ డ ఢ ణ
దంత్యాలు
దంతాల నుండి పుట్టేవి
త థ ద ధ న
ఓష్ఠ్యాలు
పెదవుల నుండి పుట్టేవి
ప ఫ బ భ మ
వర్గయుక్కులుప్రతి వర్గంలో 2వ, 4వ అక్షరాలు — ఖ-ఘ, ఛ-ఝ, ఠ-ఢ, థ-ధ, ఫ-భ · మొత్తం 10
అనునాసికాలుముక్కు సహాయంతో పలికే అక్షరాలు — జ్ఞ · ఞ · ణ · న · మ
స్పర్శ · అంతస్థ · ఊష్మ విభాగాలు
స్పర్శములు
స్పష్ట ప్రయత్నం వల్ల పుట్టే అక్షరాలు
'క' నుండి 'మ' వరకు (25 అక్షరాలు)
అంతస్థములు
స్పర్శ-ఊష్మ ప్రయత్నాల మధ్య ఉండేవి. కొంత స్వర ధర్మం + కొంత వ్యంజన ధర్మం.
య ర ల ళ వ
ఊష్మములు
గాలి ఊది పలుకబడేవి. మొత్తం 4.
శ ష స హ
ద్రుతము'న' కారం ద్రుతము. దీని అంతమందు గల పదాలు ద్రుత ప్రకృతికాలు.
స్థిరములుద్రుత ప్రకృతికాలు కాని, స్థిరమైన ఉచ్ఛారణతో పలికే పదాలు.
ఉభయాక్షరాలు
అచ్చులు, హల్లుల లక్షణాలు రెండూ కలిగి — అచ్చులుగా గాను హల్లులుగా గాను గుర్తింపబడే అక్షరాలు. మొత్తం మూడు.
ం
సున్న
పూర్ణబిందువు
పూర్వానుస్వారం
పూర్వానుస్వారం
ఉ.దా: పంట · జంట · గంట
ఁ
అరసున్న
అర్థానుస్వారము
అర్థబిందువు · ఖండబిందువు
అర్థబిందువు · ఖండబిందువు
హ్రస్వ స్వరాల తర్వాత వస్తుంది
ః
విసర్గ
తెలుగు మాటలలో ఉండదు.
సంస్కృత పదాలలో మాత్రమే.
సంస్కృత పదాలలో మాత్రమే.
ఉ.దా: అంతఃపురం · దుఃఖం
జాతీయాలు – స్వంత వాక్యాల్లో ప్రయోగం
1. చిల్లిగవ్వ
పూర్వం చలామణిలో ఉన్న నాణేలలో గవ్వలు అన్నింటికంటే తక్కువ విలువ కలవి (728 గవ్వలు = ఒక రూపాయి). అందువల్ల అసలు విలువే లేదు అని చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు.
నాణేల చరిత్ర (1803–1956):
నాణేల చరిత్ర (1803–1956):
| నాణెం | కాలం | ఒక రూపాయికి సమానం |
|---|---|---|
| గవ్వలు | 1803–1930 | 728 |
| టోలీలు | 1803–1943 | 364 |
| దమ్మిడీలు | 1831–1942 | 192 |
| కాసులు | 1853–1942 | 128 |
| కాణీలు | 1835–1942 | 64 |
| గుఱ్ఱం కాణీలు | 1950–1956 | 64 |
| కన్నం (చిల్లి) కాణీలు | 1943–1947 | 64 |
అ) వాడు ఏ పనీ చెయ్యడు. చిల్లిగవ్వకు కూడా కొరగాని వాడు.
ఆ) ఈ పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు దక్కదు.
2. గోడ మీది పిల్లి
పిల్లులు గోడమీద కూర్చొని నిదానంగా పరిశీలిస్తాయి. అవి ఇటువైపు దూకుతాయో అటువైపు దూకుతాయో చెప్పడం కష్టం. తమ నిర్ణయాలను బయటపెట్టకుండా తటస్థంగా కాలం గడిపేవారిని గురించి ఈ జాతీయాన్ని వాడతారు.
అ) గోవిందానిది గోడమీది పిల్లి వాటం. వాడు ఎప్పుడు ఏ పార్టీలోకి మారతాడో చెప్పడం కష్టం.
ఆ) ఇద్దరు కోడళ్లూ హోరాహోరీ పోట్లాడుకొంటూంటే, ఆ అత్తగారు గోడమీద పిల్లిలా కూర్చొని చూస్తోంది.
3. చేతిలో చెయ్యి వేసి చెప్పడం
చేయి-చేయి కలపడం స్నేహానికి, సమ్మతానికి గుర్తు. పెళ్లిళ్లలో పాణిగ్రహణం కూడా ఇదే సూచిస్తుంది. ఏదైనా విషయాన్ని తీర్మానించి, మాట తప్పనని చెప్పడాన్ని ఈ జాతీయం సూచిస్తుంది.
అ) గోపి వారంరోజుల్లో నా అప్పు తీరుస్తానని చేతిలో చెయ్యి వేసి చెప్పాడు.
ఆ) రాజు రాధను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆమె చేతిలో చెయ్యి వేసి చెప్పాడు.
4. కన్నుకుట్టు
పక్కవారి కలిమిని, సౌందర్యాన్ని చూసి అసూయపడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు.
అ) స్నేహితురాలు శాంతమ్మ నగలను చూసి సీతమ్మకు కన్నుకుట్టింది.
ఆ) పక్కింటివాళ్ల మామిడి చెట్టు ఇబ్బడి ముబ్బడిగా కాయలు కాయడంతో సుందరానికి కన్నుకుట్టింది.
5. కుప్పకూలు
ఉన్నవాళ్లు ఉన్నట్టే ఆకస్మికంగా కుప్పగా నేల మీద పడిపోవడం. దుర్వార్త విన్నప్పుడు లేదా అసాధారణ నొప్పిని తట్టుకోలేక నిలబడలేక నేలపై కూలడాన్ని ఈ జాతీయం సూచిస్తుంది.
అ) జపాన్లో సంభవించిన భూకంప తీవ్రతకు అక్కడి పెద్ద పెద్ద ఇళ్లు సైతం కుప్పకూలిపోయాయి.
ఆ) రామారావు తీవ్రమైన గుండెనొప్పితో అకస్మాత్తుగా కుప్పకూలాడు.
విప్పండి – పొడుపుకథలు
అయిదు గజాల పొడవు,
అయిదు గజాల లోతు ఉన్న గొయ్యి లోంచి
ఎంత మట్టిని తీయగలరు?
అయిదు గజాల లోతు ఉన్న గొయ్యి లోంచి
ఎంత మట్టిని తీయగలరు?
💬 సమాధానం రాయండి
కొనేటప్పుడు నల్లగ,
తినేటప్పుడు ఎఱ్ఱగ,
పారేసేటప్పుడు తెల్లగ
తినేటప్పుడు ఎఱ్ఱగ,
పారేసేటప్పుడు తెల్లగ
💬 సమాధానం రాయండి
ఆకాశాన అరవై గదులు
గదికో సిపాయి
సిపాయికో తుపాకి
గదికో సిపాయి
సిపాయికో తుపాకి
💬 సమాధానం రాయండి
మేలుగ నెనిమిది యొక్కశి
వాలయమున కంబుజంబు లర్పించినచో
నీ లెక్క నూట నలుబది
నాలుగు భవనములకెన్ని నలినములయ్యెన్
వాలయమున కంబుజంబు లర్పించినచో
నీ లెక్క నూట నలుబది
నాలుగు భవనములకెన్ని నలినములయ్యెన్
💬 సమాధానం రాయండి
తలయు తోకనుండు పలుక నాలుక లేదు
పండ్లు గలవు గాని కానరావు
పట్టిచూడనందు ప్రాణమే యుండదు
దీని భావమేమి తిరుమలేశ!
పట్టిచూడనందు ప్రాణమే యుండదు
దీని భావమేమి తిరుమలేశ!
💬 మీ సమాధానాన్ని కామెంట్లో రాయండి